కువైట్ పార్లమెంట్‌ రద్దు.. ముందస్తు ఎన్నికలకు పిలుపు

- June 23, 2022 , by Maagulf
కువైట్ పార్లమెంట్‌ రద్దు.. ముందస్తు ఎన్నికలకు పిలుపు

కువైట్: పార్లమెంటును రద్దు చేయనున్నట్లు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-సబా ప్రకటించారు. చట్టపరమైన,  రాజ్యాంగ మార్గదర్శకాల ప్రకారం సాధారణ సార్వత్రిక ఎన్నికలకు పోనున్నట్లు పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 107 ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం.. దేశంలోని రాజకీయ సందడిని పెంచింది. "తాము జాతీయ అసెంబ్లీని రద్దు చేసి సాధారణ ఎన్నికలకు పిలవాలని నిర్ణయించుకున్నాము." అని కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ తరపున చేసిన ప్రసంగంలో షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-సబా పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com