పక్క కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిధిగా మెగాస్టార్..
- June 24, 2022
హైదరాబాద్: గోపీచంద్–రాశిఖన్నా జంటగా మారుతీ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం పక్క కమర్షియల్. జులై 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాల ఫై దృష్టి సారించింది.ఇప్పటికే ప్రోమోస్, సాంగ్స్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ ఆకట్టుకోగా..ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేసారు.ఈ నెల 26 న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపబోతున్నారు.ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన చేసారు.
ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది. మారుతి బ్రాండ్ కామెడీ ఆకట్టుకుంటుంది. అలాగే గోపిచంద్ యాక్షన్ స్టంట్స్ ఓ రేంజ్ లో వర్కవుట్ చేశారని ఆర్డమవుతుంది. రావురమేష్ పాత్ర.. సత్యరాజ్ పాత్రల్ని కూడా బాగా వర్కవుట్ చేసారు. కామెడీ యాక్షన్ రొమాన్స్ వినోదం దేనికీ కొదవ లేని సినిమా తీశారని ట్రైలర్ ప్రామిస్ చేసింది. కమర్షియల్ అన్న కోణంలోనే బోలెడంత వినోదం పండింది.దీనికి కోర్ట్ రూమ్ డ్రామా.. లాయర్ల నేపథ్యం కూడా ఇంట్రెస్టింగ్. ఇక ట్రైలర్ లో రాశీ ఖన్నా గ్లామరస్ ట్రీట్ మరో లెవల్లో ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తూనే పక్క కమర్షియల్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ – UV క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.గల్ఫ్ లో ఈ చిత్రం జులై 1న వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ ద్వారా విడుదల కానుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







