వీఎల్ ఎస్ఆర్ సామ్ క్షిపణి పరీక్ష విజయం
- June 24, 2022
చాందీపూర్ : ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వీఎల్-ఎస్ఆర్ సామ్‌ను భారత్ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ తీరంలోగల ఇండియన్ నావల్ షిప్ (ఐఎన్ఎస్) నుంచి ఈ క్షిపణిని నిట్టనిలువుగా పరీక్షించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
వీఎల్-ఎస్ఆర్ అనేది షిప్ బార్న్ వెపన్ సిస్టం. ఇది సీ స్కిమ్మింగ్ లక్ష్యాలతో సహా సమీప పరిధిలోని వైమానిక ముప్పులను న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ రోజు హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్ అనుకరించే విమానానికి వ్యతిరేకంగా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని డీఆర్డీవో తెలిపింది. ఈ పరీక్షను డీఆర్డీవో, భారత నౌకాదళానికి చెందిన సీనియర్ అధికారులు పర్యవేక్షించారని పేర్కొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!