యాత్రీకులకు ప్రమాదకరమైన ఆహారం పంపిణీ చేస్తే జైలు మరియు భారీ జరిమానా

- June 24, 2022 , by Maagulf
యాత్రీకులకు ప్రమాదకరమైన ఆహారం పంపిణీ చేస్తే జైలు మరియు భారీ జరిమానా

రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్, కీలకమైన హెచ్చరిక చేసింది. యాత్రీకులకు ఆహారం పంపిణీ చేసేవారికి ఈ హెచ్చరిక చేయడం జరిగింది. యాత్రీకుల ఆరోగ్యం దెబ్బతినేలా ఆహారం ఎవరైనా పంపిణీ చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటారు. అమ్మడం లేదా పంపిణీ చేస్తే, అందుకు జైలు శిక్ష అలాగే జరీమానా తప్పవు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించేవారికి ఈ చర్యలు వర్తిస్తాయి. పదేళ్ళ వరకు జైలు శిక్ష అలాగే 10 మిలియన్ సౌదీ రియాల్స్ వరకూ జరీమానా బాధ్యులకు విధించడం జరుగుతుంది. ఉల్లంఘనుల లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com