హంతకుణ్ణి పట్టుకున్న పోలీసులు

- June 26, 2022 , by Maagulf
హంతకుణ్ణి పట్టుకున్న పోలీసులు

షార్జా: యువతి హత్య కేసు కీలక మలుపు తిరిగింది,తన కారులోనే విగత జీవిగా పడివున్న యువతిని మృతదేహాన్ని గుర్తించిన షార్జా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ శాఖకు చెందిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన 2 గంటల్లోనే  కిల్లర్ ను పట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే శుక్రవారం నాడు తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తమ అధికారులతో గాలింపు చేయగా తన అపార్ట్ మెంట్ పార్కింగ్ లోనీ తన సొంత కారులోనే ఆమె విగత జీవిగా పడివుంది. 

షార్జా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉప డైరెక్టర్ కల్నల్ ఫైసల్ బిన్ నాసర్ మాట్లాడుతూ యువతి మృతదేహాన్ని ఆమె కారులోనే గుర్తించడం జరిగిందని తెలియజేశారు.

కేసును సీరియస్ తీసుకొని దర్యాప్తు ప్రారంభించిన షార్జా పోలీసులు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను మరియు ఘటనకు సంబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు  చేయగా ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తే హత్య చేసినట్లుగా గుర్తించారు. 

హంతకుడు పోలీసులకు పట్టుబడ్డ కుండా ఉండేందుకు బీచ్ రిసార్ట్ లో దాక్కున్నాడు.ఈ విషయాన్ని తమ నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.వ్యక్తిగత కక్షతో యువతిని హత్య చేసినట్లుగా పోలీసుల కస్టడీలో ఉన్న హంతకుడు ఒప్పుకున్నాడు. నిందితున్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్  బదిలీ చేయడమే కాకుండా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 

షార్జా పోలీస్ డిపార్ట్మెంట్ మేజర్ జనరల్ సైఫ్ అల్ జారీ అల్ షంసి మాట్లాడుతూ పౌరుల భద్రతే షార్జా పోలీస్ డిపార్ట్మెంట్ కు ముఖ్యమని పేర్కొన్నారు.అంతేకాకుండా రికార్డ్ సమయంలో కేసును ఛేదించిన తమ సిబ్బందిని అభినందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com