గల్ఫ్ విమానయాన ఖర్చులు మీద చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపి సదాశివన్
- June 26, 2022
కేరళ: విపరీతంగా పెరిగిపోయిన గల్ఫ్ విమానయాన ప్రయాణ ఖర్చులు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ పార్లిమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళకు చెందిన సిపిఎం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ డి.వి.సదాశివన్ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు లేఖ రాశారు.
వేసవి కాలం మొదలయ్యే సమయానికి గల్ఫ్ దేశాలలో పాటుగా యూఏఈ కూడా విమానయాన ప్రయాణ ఖర్చులను భారీగా పెంచాయి.
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులలో భారతీయులు కూడా పనిచేస్తున్నారు.వేసవిలో వారికి సెలవులు కావడంతో తమ స్వదేశానికి రావడానికి ఇష్టపడతారు.గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల మీద విధించిన ఆంక్షలు నేపథ్యంలో వారు రాలేకపోయారు. కానీ ఇప్పుడు వద్దామంటే విమానయాన సంస్థలు పెంచిన ప్రయాణ ఖర్చులు కారణంగా చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.కాబట్టి ఈ విషయంలో మీరు చొరవ తీసుకుని సమస్యను పరిష్కారించాలని కేంద్ర మంత్రిని సదాశివన్ కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







