'పక్కా కమర్షియల్'.. టికెట్లు మాత్రం కమర్షియల్ కాదు..
- June 26, 2022
హైదరాబాద్: గోపీచంద్ అంటే యాక్షన్, మారుతీ అంటే హ్యూమర్ ఈ రెండు కలిస్తే రచ్చ రచ్చే.ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో ఎంటర్ టైన్మెంట్ పక్కా అంటున్నారు గోపీచంద్, మారుతి. గత కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో నిరాశ చెందిన గోపీచంద్ కి సంపత్ నంది దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సీటీమార్ కాస్త ఉపశమనం కలిగించింది.ఇప్పుడు మంచి కామెడి టైమింగ్ తో వరసగా సక్సెస్ లు కొడుతున్న మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మారతితో, పక్కా యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది.ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్ అంచనాలను పెంచేస్తోంది.
జులై 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించి, ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయబోతుంది.గత కొద్దికాలంగా సినిమా బాగున్నా టికల్ట్ రేట్లు ఎక్కువుండటంతో కలెక్షన్స్ రావట్లేదు. ఈ విషయం నిర్మాతలకి అర్థమై ఇప్పుడిప్పుడే టికెట్ రేట్లని తగ్గిస్తున్నారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ కూడా టికెట్ల ధరల విషయంలో మాత్రం కమర్షియల్ కాదంటుంది. తెలంగాణలో సింగిల్ థియేటర్లకు 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 160 రూపాయలు కాగా, ఏపిలో నార్మల్ థియేటర్లకు 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలుగా ఉండబోతుందని ప్రకటించి ఇప్పటికే ప్రేక్షకులను థియేటర్స్ కి ఆకర్షిస్తుంది పక్కాకమర్షియల్ టీమ్. లక్ష్యం, లౌఖ్యం, జిల్ లాంటి సినిమాలతో యాక్షన్ తో పాటు కామెడి పండించిన గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో మారుతి మార్క్ ఫన్ ని,యాక్షన్ హీరో గోపీచంద్ ఎలా చేసి ఉంటారో అనే చర్చ ఇప్పటికే ఫాన్స్ మధ్య నడుస్తోంది.
ప్రస్తుతం ప్రమోషన్ తో బిజీగా ఉంది టీం.ఈ ఆదివారం జరగనున్న పక్కాకమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తుండటంతో ఈ సినిమాపైన మెగా అభిమానులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన జిల్, ఆక్సిజన్ తర్వాత మూడోసారి హీరోయిన్ గా నటిస్తుంది రాశిఖన్నా.మరి పక్కా కమర్షియల్ గోపీచంద్, మారుతికి రేంజ్ కమర్షియల్ హిట్ ఇస్తుందో చూడాలి.గల్ఫ్ లో ఈ సినిమా జులై 1న వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ ద్వారా విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







