డల్లాస్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణం
- June 26, 2022
అమెరిక: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.
కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.
డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖపట్నం ఎంపి సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డితో సహ పలువురు ప్రముఖులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







