మెరీనా బేలో ‘అరేబియా రెడ్ ఫాక్స్’ హల్ చల్
- June 27, 2022
అబుదాబి: అబుదాబిలోని రీమ్ ద్వీపంలో ఒక అరేబియా ఎర్ర నక్క కనిపించింది. మెరీనా బే సమీపంలో దీన్ని పలువురు చూశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. పర్యావరణ ఏజెన్సీ అబుదాబి ప్రతినిధి మాట్లాడుతూ.. అరేబియన్ రెడ్ ఫాక్స్ లు పట్టణంలో విరివిగా కన్పిస్తున్నాయన్నారు. నగరంలోని పెద్ద డస్ట్ బిన్ల దగ్గర వృధా ఆహార పదార్థాలను అరేబియన్ రెడ్ ఫాక్స్ తినడం తరచుగా చూడవచ్చన్నారు. ప్రజలు వాటి దూరంగా ఉండాలని, ఆహారం ఇచ్చేందుకు దగ్గరకు పోవద్దని సూచించారు. సాధారణంగా అరేబియన్ రెడ్ ఫాక్స్ మనుషులకు దూరంగా ఉంటాయని, కానీ కొన్ని సందర్భాల్లో అవి మనుషులకు దగ్గరగా వస్తాయని, అవి పైపైకి వచ్చినప్పుడు భయంతో పరుగులు తీయొద్దని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?