కోవిడ్-19 వ్యాప్తి.. ఒమన్ లో స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్

- June 27, 2022 , by Maagulf
కోవిడ్-19 వ్యాప్తి.. ఒమన్ లో స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్

మస్కట్: కోవిడ్ -19 వ్యాక్సిన్ మూడవ లేదా బూస్టర్ డోస్ తీసుకోని ఒమానీలు, నివాసితులు వెంటనే బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అలాగే 9 నెలల క్రితం మూడవ డోస్ పొందిన వారు కూడా సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్లో ఉచితంగా డోస్ తీసుకోవాలని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ మోతాదులు అనుమతించిన ప్రైవేట్ ఆరోగ్య సంస్థలలో కూడా అందుబాటులో ఉంటాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com