సౌదీలో సెమిస్టర్ పరీక్షలు.. 5 మిలియన్ల స్టూడెంట్స్ హాజరు

- June 27, 2022 , by Maagulf
సౌదీలో సెమిస్టర్ పరీక్షలు.. 5 మిలియన్ల స్టూడెంట్స్ హాజరు

రియాద్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1443 AH సంవత్సరం మూడవ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు దాదాపు 4,980,229 మంది విద్యార్థు హాజరవుతున్నారు.  ఇవి వచ్చే బుధవారం వరకు కొనసాగనున్నాయి. విద్యా మంత్రిత్వ శాఖా అధికారులు పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలల పాఠ్యాంశాలను సమీక్షించడానికి, వివిధ విభాగాలకు సమగ్ర మానసిక ప్రణాళికలను రూపొందించడానికి టైమ్‌టేబుల్‌ను తయారు చేయడంతో సహా, చివరి పరీక్షలకు బాగా సిద్ధం కావడానికి విద్యార్థులకు చిట్కాలు, సూచనలను "ట్విటర్"లో మంత్రిత్వ శాఖ అందుబాటులో పెట్టింది. తగినంత నిద్ర పోవాలని, ఒత్తిడికి గురికావద్దని, పాఠ్యాంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ప్రతి పాఠానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి రివిజన్ చేయాలని విద్యార్థులకు మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com