తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే

- June 27, 2022 , by Maagulf
తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే

సౌదీ అరేబియా: సౌదీ స్పేస్ కమిషన్ మరియు టెక్ జెయింట్ హువేయి సంయుక్తంగా ఫ్యూచర్ స్పేస్‌ని ప్రారంభించడం జరిగింది. సౌదీ అరేబియా తొలి టెక్నాలజీ నైపుణ్య కేంద్రమిది. చైనా వెలుపల అతి పెద్ద ఎగ్జిబిషన్ కేంద్రంగా ఈ ఫ్యూచర్ స్పేస్‌ని ఞువేయి అభివర్ణించింది. త్రీడీ ప్రింటింగ్ తదితర అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ వుంది. కొత్త ఆలోచనలతో భవిష్యత్తుని కోరుకునే యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫ్యూచర్ స్పేస్ గురించి సౌదీ పేర్కొంది. స్థానిక నైపుణ్యాలకు పదును పెట్టేలా ఈ కేంద్రం యువతకు సాయపడుతుంది. రానున్న ఐదేళ్ళలో సుమారు 200,000 మంది సందర్శకులు ఈ కేంద్రాన్ని సందర్శిస్తారనేది ఓ అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com