బీచ్‌లలో 90 సెకెన్ల షవర్‌కి 5 దిర్హామ్‌లు
- April 10, 2016
జుమైరా బీచ్ రెసిడెన్స్‌కి దగ్గరలో ఉన్న బీచ్‌లో ఇకపై షవర్ బాత్‌కి 5 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. 90 సెకెన్లకుగాను 5 దిర్హామ్‌ల రుసుమును నిర్ణయించారు. అయితే దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. పబ్లిక్ బీచ్‌లో, షవర్ బాత్‌కి ఛార్జీలు వసూలు చేయడం మంచిది కాదని సిండీ అనే మహిళ చెప్పారు. ఫెయిత్ అనే మహిళ కూడా, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయితే, బీచ్ నిర్వాహకులు మాత్రం, నీటి వృధాని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, బీచ్‌కి వచ్చేవారిలో అవగాహన పెంచడం, అలాగే బాధ్యతగా వారు వ్యవహరించేలా చేయడానికే నామినల్ చార్జ్ చేస్తున్నామని చెప్పారు. దుబాయ్‌కి చెందిన వెరోనికా పినెడా మాట్లాడుతూ, ఫీజు చాలా ఎక్కువ ఏమీ కాదని, అన్నీ ఉచితంగా కావాలని కోరుకోవడం సబబు కాదని అన్నారు. ఎక్కువ మొత్తం కాకపోయినప్పటికీ బీచ్ షవర్ అనేది ఉచితంగా ఉండటమే మేలని బెతనీ డెవన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









