టాలీవుడ్ తెరపై సోనాక్షి సిన్హా: ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోందా.?
- June 28, 2022ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు చాలా టెక్కు చేసేవారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు. సౌత్ సినిమాని చిన్న చూపు చూసేవారు. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే, ససేమిరా అనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే మాటే లేదు. ‘ఇండియన్ సినిమా’గా సినిమా చెలామణీ అవుతోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలకు బాలీవుడ్లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. దాంతో నార్త్ భామలు సౌత్‌లో సినిమాలు చేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లయిన శ్రద్ధా కపూర్, అలియా భట్, దీపికా పదుకొనె, దిశా పటానీ తదితరులు తెలుగు తెరపై సందడి చేస్తున్నారు.
ఇప్పుడు సోనాక్షి సిన్హా వంతు వచ్చింది. గతంలోనూ సోనాక్షికి కొన్ని తెలుగు సినిమా ఆఫర్లు వచ్చాయ్. కానీ, అప్పట్లో కాదనుకుంది. ఇప్పుడు కోరుకున్నా దక్కించుకోలేకపోతోంది. ఇక, తాజాగా ఓ తెలుగు సినిమా కోసం సోనాక్షితో సంప్రదింపులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఓ సీనియర్ నటుడి సినిమా కోసం సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఆ ప్రాజెక్ట్ చేయడానికి సోనాక్షి రెడీగానే వుందట. ఓ ప్రముఖ బ్యానర్లో ఈ సినిమా రూపొందబోతోందట. ఆ సీనియర్ హీరో ఎవరు.? ఏంటా పెద్ద బ్యానర్.? అనేవి ప్రస్తుతానికి సస్పెన్స్.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్