ఎమిరేట్స్ టిక్కెట్ కొనుగోలుపై బుర్జ్ ఖలీఫాకు ఉచిత టిక్కెట్
- June 29, 2022
దుబాయ్: ఎమిరేట్స్ టిక్కెట్ కొనుగోలుపై బుర్జ్ ఖలీఫాకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రకటించింది. దుబాయ్ ఫ్లాగ్‌షిప్ క్యారియర్‌తో తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణీకులు ఎట్ ది టాప్, బుర్జ్ ఖలీఫా, ది దుబాయ్ ఫౌంటెన్ బోర్డ్‌వాక్, లౌవ్రే అబుధాబిలో ప్రవేశించడానికి ఉచిత టిక్కెట్లను పొందొచ్చని ఎమిరెట్స్ ఆఫర్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఈ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారని అంతగా అవి ప్రాచుర్యం పొందాలయని పేర్కొంది. జూన్ -జూలై మధ్య యూఏఈ నుండి 2,400 వీక్లీ నెట్‌వర్క్-వైడ్ డిపార్చర్ సర్వీసులు నమోదయినట్లు ఎమిరెట్స్ వెల్లడించింది. ఉచిత టిక్కెట్‌లను కోరుకునే ప్రయాణీకులు emiratesoffer@ emirates.com కి ఇమెయిల్ పంపాలని కోరింది. అలాగే ఉచిత ఎంట్రీ టికెట్ కోసం కోడ్‌లను స్వీకరించడానికి బుకింగ్ రిఫరెన్స్ నంబర్, ప్రయాణం తేదీ, ప్రయాణీకుల పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాను నమోదు చేయాల్సి ఉంటుందని ఎమిరెట్స్ తెలిపింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!