48 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్: సౌదీ
- June 29, 2022
సౌదీ: అనేక ఆరోపణలపై 171 మంది ప్రభుత్వ ఉద్యోగులను విచారించి.. వారిలో 48 మందిని క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రకారం అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియాకు చెందిన ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. AH 1443 ధుల్-ఖదా నెలలో అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను ప్రారంభించినట్లు నజాహా పేర్కొంది. అధికార దుర్వినియోగం, లంచం, మనీ లాండరింగ్, ఫోర్జరీ వంటి అనేక ఆరోపణలపై 4,672 మానిటరింగ్ రౌండ్లను నిర్వహించి అనేక మందిని విచారించి కొందరిని అరెస్టు చేశామని అథారిటీ తెలిపింది. అరెస్టయిన వారిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను- కస్టమ్స్ అథారిటీలకు చెందిన వారున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







