పలువురు బాలీవుడ్ తారలకు యూఏఈ గోల్డెన్ వీసా

- June 29, 2022 , by Maagulf
పలువురు బాలీవుడ్ తారలకు యూఏఈ గోల్డెన్ వీసా

యూఏఈ: యూఏఈలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం ఇచ్చే గోల్డెన్ వీసా ప్రకటించింది. సల్లూభాయ్‌తో పాటు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ దంపతులు, దివ్య కుమార్, భూషణ్ కుమార్, అన్నీస్ బేజ్మీ, అండ్రే తిమ్మిన్స్‌కు కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ నెలలో అబుదాబిలోని యాస్ ఐలాండ్ సగర్వంగా 2022 IIFA వీకెండ్ & అవార్డ్స్‌ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన పలువురు నటీనటులు అబుదాబికి వెళ్లారు. ఎతిహాద్ ఏరెనా నెక్సా ఐఐఎఫ్ఏ అవార్డ్స్‌కు సంబంధించిన 22వ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చింది. ఇక ఈ వేదిక సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల్లో కొంతమందికి గోల్డెన్ వీసా జారీ ప్రక్రియను సులభతరం చేసే విషయమై అబుదాబి ఫిల్మ్ కమిషన్‌తో కలిసి పనిచేసినందుకు IIFA సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో అబుదాబి పరిశ్రమల సృజనాత్మక నిబద్ధతను ప్రతిబింబించేలా IIFA వారాంతంలోనే ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్‌కు గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com