లైసెన్స్ లేకుండానే బ్యూటీ పార్లర్ నిర్వహణ.. ఓనర్ అరెస్ట్
- June 30, 2022
కువైట్: సబా అల్-సలేం ప్రాంతంలోని మహిళా సెలూన్‌పై త్రిసభ్య కమిటీ దాడి చేసింది. లైసెన్స్ లేకుండా సెలూన్ నిర్వహిస్తున్నందుకు యజమానిని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని సివిల్ మెడికల్ సర్వీసెస్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డా. ఫాతిమా అల్-నజ్జర్ మాట్లాడుతూ.. మహిళా సెలూన్లో లైసెన్స్ లేని ఫిలిపినో వర్కర్ ని నియమించుకున్నారని, లేజర్ వంటి లైసెన్స్ లేని పరికరాలను ఉపయోగిస్తున్నారని ప్రకటించారు. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ లైసెన్స్ లేని మెడిసిన్స్, ఆంపౌల్స్ పదార్థాలు వంటి వాటిని వాడుతున్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ – ఆరోగ్య లైసెన్సింగ్ విభాగం, ఔషధాల తనిఖీ విభాగం, అంతర్గత మంత్రిత్వ శాఖ, మానవశక్తి కోసం పబ్లిక్ అథారిటీ ప్రతినిధులతో కూడిన త్రిసభ్య కమిటీ ప్రయత్నాలను ఈ సందర్భంగా డాక్టర్ అల్-నజ్జర్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







