ఈద్ అల్-అధా సెలవులు.. ప్రయాణీకులకు సలహాలు

- June 30, 2022 , by Maagulf
ఈద్ అల్-అధా సెలవులు.. ప్రయాణీకులకు సలహాలు

దోహా: జూన్ 30, 2022 నుండి దోహా నుండి అధిక సంఖ్యలో ప్రయాణీకులు బయలుదేరుతారు. అలాగే జూలై నుండి దోహాకు తిరిగి వచ్చే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈద్ అల్-అధా సెలవుల కోసం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) ప్రయాణీకులకు పలు సూచనలు జారీ చేసింది.

-ప్రయాణీకులు కర్బ్ సైడ్‌కు బదులుగా స్వల్పకాలిక కార్ పార్కింగ్‌లో పికప్, డ్రాప్‌లను నిర్వహించాలని సూచించారు.

-కాంప్లిమెంటరీ కార్ పార్క్ సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు.

-ఆన్‌లైన్‌లో చెక్-ఇన్ చేయాలని, విమానయానానికి 3 గంటల ముందుగా ఎయిర్ పోర్టు చేరుకోవాలన్నారు. ముందస్తు చెక్-ఇన్ సేవలను పొందాలని సూచించారు.

-ఖతార్ ఎయిర్‌వేస్ కస్టమర్‌లు సెల్ఫ్-సర్వీస్ చెక్-ఇన్, బ్యాగ్-డ్రాప్ సౌకర్యాలను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇ-గేట్ సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు.

-ప్రయాణికులు తమ నిర్దిష్ట విమానయాన సంస్థ నుండి బ్యాగేజీ మార్గదర్శకాలను ముందుగానే తెలుసుకోవాలన్నారు.

-బ్యాగేజీ రీప్యాక్ ఏరియా ప్రయాణికులకు డిపార్చర్ హాల్‌లో లగేజీ వెయింగ్ మెషీన్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.

-సెక్యూరిటీ స్క్రీనింగ్‌కు ముందు గడియారాలు, బెల్ట్‌లు, వాలెట్లు, ఆభరణాలు వంటి వ్యక్తిగత వస్తువులను ట్రేలలో వదులుగా ఉంచకుండా బ్యాగ్ లోపల సురక్షితంగా పెట్టుకోవాలని సూచించారు.

-మొబైల్ ఫోన్‌ల కంటే పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగ్‌ల నుండి తీసి ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం ట్రేలలో పెట్టాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com