యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా.. 10 మంది అరెస్ట్
- June 30, 2022
సౌదీ: 3,510,000 యాంఫెటమైన్ మాత్రలను దేశంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు విఫలం చేశారని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ (జిడిఎన్‌సి) ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నుజైదీ తెలిపారు. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో రాళ్లు, తోటపని సామాగ్రిలో దాచి రవాణా చేస్తున్న డ్రగ్స్ ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు సంబంధించి ముగ్గురు టర్కీ నివాసితులు, మరొకరు గుర్తుతెలియని నివాసి, సందర్శకుల వీసాపై ఉన్న వ్యక్తి, ఉమ్రా వీసాపై ఉన్న ఒక సిరియన్, నలుగురు సౌదీలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు అల్-నుజైదీ తెలిపారు. జకాత్, పన్ను-కస్టమ్స్ అథారిటీ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల