భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు..
- June 30, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు లక్ష సంఖ్యను దాటేశాయి. మంగళవారం కేసుల సంఖ్య 14వేల 506గా ఉండగా 30 మరణాలు సంభవించాయి. బుధవారం 18వేల 819కేసులు నమోదై 39మరణాలు వాటిల్లాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు లక్షా 4వేల 555కు చేరాయి. రోజువారీ పాజిటివిటి రేటు 4.16 శాతానికి చేరగా.. దేశ జనాభాలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.24 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 34లక్షల 52వేల 164కేసులు నమోదుకాగా 5లక్షల 25వేల 116 మరణాలు సంభవించినట్లు సమాచారం.
కరోనా రికవరీ రేటు దేశంలో 98.55 శాతంగా ఉండగా.. బుధవారం ఒక్కరోజే 13వేల 827 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4కోట్ల 28లక్షల 22వేల 493 మందిగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 531 రోజులకు చేరింది. ఇప్పటివరకు 197.51 కోట్ల డోసుల టీకాలు అందజేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 197కోట్ల 51లక్షల 46వేల 587 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల