హజ్ యాత్రికుల కోసం ‘హలో డాక్టర్’ సేవలు ప్రారంభం
- June 30, 2022
సౌదీ: సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ "హలో డాక్టర్" సేవను ప్రారంభించారు.ఈ ప్రాజెక్టును సౌదీ టెలికమ్యూనికేషన్ కంపెనీ (STC) సహకారంతో వైద్య సంప్రదింపుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం హజ్ సీజన్లో యాత్రికులకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆధునిక వైద్య సేవలను అందించేందుకు హలో డాక్టర్ సేవలు ఉపయోగపడతాయని ఫహద్ అల్-జలాజెల్ తెలిపారు. రియాద్‌లోని సెహా వర్చువల్ హాస్పిటల్‌తో రోగులకు అవసరమైన సేవలు అందాతాయన్నారు. అలాగే తనిఖీ, రోగ నిర్ధారణ, మందుల పంపిణీ కూడా ఈ సర్వీసులో భాగంగా అందిస్తారని పేర్కొన్నారు. వైద్య, సాంకేతిక, పరిపాలనా పర్యవేక్షణలో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్‌ల సమితిని కలిగి ఉన్న పవిత్ర ప్రదేశాలలో సమగ్ర ఆరోగ్య సౌకర్యాల వ్యవస్థ ద్వారా 1443 హిజ్రీ సంవత్సరం హజ్ సీజన్ కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చాలా ముందుగానే సిద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు. సురక్షితమైన వాతావరణంలో ఆచారాలను నిర్వహించడానికి చొరవ చూపిన రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు క్రౌన్ ప్రిన్స్ కింగ్ సల్మాన్ కు మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







