ఫేక్ వీసాలు: వలసదారుడికి 10 ఏళ్ళ జైలు

- June 30, 2022 , by Maagulf
ఫేక్ వీసాలు: వలసదారుడికి 10 ఏళ్ళ జైలు

బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే, నిందితుడికి జైలు శిక్ష తర్వాత బహిష్కరణ వేటు వేయడం కూడా జరుగుతుంది. ఓ నివాసితుడి నుంచి 400 బహ్రెయినీ దినార్లు తీసుకుని, అతని కుటుంబ సభ్యులకు అనుమతులు మంజూరు చేయిస్తానంటూ మోసానికి పాల్పడ్డాడు నిందితుడు. కాగా, ఆ అనుమతులన్నీ ఫేక్ అని విచారణలో తేలింది. ఫేస్ బుక్ ద్వారా ప్రకటన చూసి తాను మోసపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com