దుర్ముఖీ!!
- April 11, 2016

దుర్ముఖి నామ వత్సరమ! దోసిలియొగ్గి నమస్కరించెదన్!
ధర్మము నాల్గుపాదముల తప్పకయుండు విధంబు జూపుమా
మర్మము లేక మాపయి సమంచిత దృక్కులవిందుసేయుమా
అర్మిలి నీకు సాదర శుభాగమ తోరణముల్ ఘటించెదన్.
దుర్ముఖి నామధేయమున దుష్ట చరత్వము గోచరింపదే!
నర్మ కుయుక్తులన్ వదలి నవ్యపథంబున సాగిపొమ్ము మా
కర్మము కాలెనంచు కడు గాసిలిపోవను- సన్ముఖంబుతో
నిర్మల భాగ్యదాయివయి నిత్య సుఖంబులనిచ్చి బ్రోవుమా.
మామిడికొమ్మపైన మధుమాస విలాస వినోద మంజరీ
కోమల కోకిలస్వనము కోటి వసంత పసందు రాగముల్
వేమరు పల్కుచుండ ప్రభవించిన చైత్ర ఉగాది వేడుకల్
నామది నిండి యీకవిత నర్తనమాడెను నాకలంబునన్.
మన్మథ! వీడుకోలు గొనుమా! తెలుగిండ్లను తీపి, చేదుగా
ఉన్ముఖమైన నీచరితకున్నది ప్రాభవ వైభవంబు, మా
జన్మల కొత్త వెల్గుల ప్రసారములబ్బెను-పోయిరమ్ము ఠే
వన్మధు రాగరంజిత ప్రభావము జూపితివమ్మ మాపయిన్.
నందన వనమున విరిసిన
సుందర సుకుమారమౌ ప్రసూనము వోలెన్
సందడి చేయుత దుర్ముఖి
చందనమై, చల్లనై ప్రశస్తి లభింపన్.
బి.వి.వి.హెచ్. బి.ఫ్రసాదరావు ఎం.ఎ; ఎం యిడి
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







