ఒమానీ కంపెనీకి మైక్రోసాఫ్ట్ గుర్తింపు

- July 02, 2022 , by Maagulf
ఒమానీ కంపెనీకి మైక్రోసాఫ్ట్ గుర్తింపు

మస్కట్: ఆధునిక పరికరాల కేటగిరీ కోసం మైక్రోసాఫ్ట్ మోడరన్ డివైస్ పార్ట్ నర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఒమానీ కంపెనీ ఆన్సోర్ టెక్నాలజీస్(Onsor Technologies) ఫైనలిస్ట్ గా గుర్తింపు పొందింది. మైక్రోసాఫ్ట్ నుంచి గుర్తింపు పొందడంపై ఆన్సోర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ సలాహ్ అల్ రస్బీ హర్షం వ్యక్తం చేశారు.  మైక్రోసాఫ్ట్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గత సంవత్సరంలో అత్యుత్తమ మైక్రోసాఫ్ట్ ఆధారిత అప్లికేషన్‌లు, సేవలు, పరికరాలను అభివృద్ధి చేసిన, డెలివరీ చేసిన మైక్రోసాఫ్ట్ భాగస్వాములను గుర్తించి అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి 3,900 వచ్చిన నామినేషన్ల నుండి వీరిని ఎంపిక చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com