అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

- July 04, 2022 , by Maagulf
అల్లూరి  సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

అమరావతి: ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. సభా వేదిక నుంచే వర్చువల్‌ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

స్వాతంత్య్రం కోసం పోరాడిన సమర యోధులను స్మరించుకోవడం కోసం ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా అల్లూరి 125 వ జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశం కోసం అనేక మంది మహానుభావులు త్యాగాలు చేశారని అన్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి , ఏపీ మంత్రి రోజా, కేంద్ర మాజీ మంత్రులు, చిరంజీవి, పురందేశ్వరీ తదితర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com