అనసూయ క్రేజ్‌కి బ్రేకుల్లేవుగా..! చెలరేగిపోతోంది.!
- July 04, 2022
బుల్లితెర హాటెస్ట్ యాంకర్‌గా అనసూయకు మంచి పేరుంది. ఆ పేరుతోనే ఇప్పుడు వెండితెరపైనా క్రేజీయెస్ట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అనసూయ కోసం బుల్లితెరపై కొంగొత్త క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో.
వయసు మీద పడుతున్నా, ఐటెం సాంగ్స్ ఓ పక్క, అదిరిపోయే ఇంపార్టెంట్ రోల్స్ ఇంకో పక్క.. అనసూయ కెరీర్‌కి ఇప్పట్లో ఢోకానే లేదనాలేమో. దాంతో పాటు, తాజాగా ఓటీటీ తెర పైనా అనసూయ హల్‌చల్ మొదలైంది.
ఇప్పటికే మెగా డాటర్ నిహారికతో కలిసి అనసూయ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అలాగే, మరో కొత్త వెబ్ సిరీస్‌కి అనసూయ ఎంపికైనట్లు తెలుస్తోంది. కన్యాశుల్కం నవల ఆధారంగా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్‌కి డైరెక్టర్ క్రిష్ స్ర్కిప్ట్ అందిస్తున్నాడట. అలాగే, నిర్మాణంలోనూ క్రిష్ భాగస్వామ్యం వహిస్తున్నాడట.
ఈ సిరీస్‌లోని ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అనసూయను సజెస్ట్ చేశాడట క్రిష్ జాగర్లమూడి. అది ఓ వేశ్య పాత్రనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రారంభం కానుందట. సౌత్‌లోని అన్ని భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ స్ర్టీమింగ్ కానుందట. అనసూయకి సంబంధించి ఇదో తాజా హాటెస్ట్ అప్‌డేట్‌గా చెప్పుకోవచ్చు.
వీటితో పాటు, ‘పుష్ప 2’ తదితర క్రేజీయెస్ట్ ప్రాజెక్టులు అనసూయ చేతిలో వున్నాయ్. అన్నట్లు ఈ మధ్యనే తన బిజీ షెడ్యూల్ కారణంగా ‘జబర్దస్త్’ షోకి అనసూయ గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







