ఈద్ రద్దీ.. మావలే సెంట్రల్ మార్కెట్ పని గంటలు పొడిగింపు
- July 05, 2022
మస్కట్: ఈద్ అల్ అదా రద్దీ నెలకొన్న వేళ కూరగాయలు, పండ్ల కోసం మావాలే సెంట్రల్ మార్కెట్ పని గంటలను మస్కట్ మునిసిపాలిటీ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయదారులు, వినియోగదారుల కోసం మార్కెట్ తెరిచి ఉంటుందని తెలిపింది. పొడిగించిన పని గంటలు శుక్రవారం(జూలై 9) వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈద్ అల్ అదా షాపింగ్‌ను సులభతరం చేయడానికి పని గంటలు పొడిగించబడ్డాయని పేర్కొన్నారు. హోల్‌సేల్ వ్యాపారులు గేట్ నంబర్ 1 నుండి.. వ్యక్తిగత వినియోగదారులు గేట్ నంబర్ 2ను వినియోగించోవాలని కోరింది. ఈద్ అల్ అధా మొదటి, రెండవ రోజున మార్కెట్ మూసివేయబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..