అయ్యో పాపం తమన్నా.! అప్పుడలా.. ఇప్పుడిలా.!

- July 05, 2022 , by Maagulf
అయ్యో పాపం తమన్నా.! అప్పుడలా.. ఇప్పుడిలా.!

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకి మోక్షం కుదరట్లేదు. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని జూలై 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు.

అయితే, కొన్ని అనూహ్య కారణాల వల్ల ఈ సినిమా ఆగస్ట్ 5కు వాయిదా పడింది. నిజానికి ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా ఇది. కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీని తలపిస్తున్నట్లున్నాయ్. 

కానీ, ఈ ఫీల్ గుడ్ మూవీ రిలీజ్‌కి మాత్రం సరైన ఫీల్ ఏర్పడడం లేదు. ఆగస్టులోనైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలీయని పరిస్థితి. అన్నట్లు తమన్నా గతంలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం కూడా ఇలాగే అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రిలీజే కాలేదు ఆ సినిమా.

మరోవైపు సత్యదేవ్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. మొన్నీ మధ్యనే ‘గాడ్ సే’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ‘గుర్తుందా శీతాకాలం’ సత్యదేవ్‌కి ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాడు సత్యదేవ్.చూడాలి మరి, ఆగస్ట్ 5 న ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com