తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
- July 06, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏరో ఇంజిన్ రిపేర్ సంస్థ సఫ్రాన్ తెలంగాణలోకి అడుగుపెట్టబోతోంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆ సంస్థ విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ (MRO) యూనిట్‌ను నెలకొల్పనుంది.హైదరాబాద్‌లో నెలకొల్పనున్న ఎంఆర్ఓ యూనిట్ ఆ సంస్థ అన్ని యూనిట్లలోకి అతి పెద్దదిగా నిలవనుంది. హైదరాబాద్ యూనిట్ కోసం ఆ కంపెనీ తొలి విడతగా 150 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.
హైదరాబాద్‌లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సఫ్రాన్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఏరో ఇంజిన్ రిపేర్ రంగంలో భారత్‌లో ఇప్పటిదాకా ఏ విదేశీ కంపెనీ తన యూనిట్‌ను ఏర్పాటు చేయలేదన్న కేటీఆర్…హైదరాబాద్‌లో సఫ్రాన్ ఏర్పాటు చేయనున్న యూనిట్ భారత్‌లో తొలి విదేశీ కంపెనీ యూనిట్‌గా రికార్డులకు ఎక్కనుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 800 నుంచి 1,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ యూనిట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







