వాణిజ్య మోసాలకు పాల్పడిన వారికి జైలు మరియు జరిమానా
- July 06, 2022
దమ్మమ్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ లో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన మోసాలకు పాల్పడిన 10 మంది విదేశీ కార్మికులకు అక్కడి దమ్మమ్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష మరియు జరిమానా విధించినట్లు తూర్పు ప్రావిన్స్ వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటంచింది.
ఖతిఫ్ గవర్నరేట్ లో ఏటువంటి ప్రభుత్వ గుర్తింపు లైెన్సులను లేకుండా నడుపుతున్న పొగాకు కంపెనీ గత కొన్నాళ్లుగా తన అమ్మకాల్లో పలు వాణిజ్య అవకతవకలకు పాల్పడినట్లు మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కంపెనీ యజమాని కి అక్కడ పనిచేస్తున్న విదేశీ కార్మికులు సహకరించారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు కంపెనీ యజమానికి సంవత్సరం జైలు శిక్ష, అతనికి సహకరించిన 10 మంది భారత్, బంగ్లాదేశ్ చెందిన విదేశీ కార్మికులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే SR 720000 జరిమానా సైతం విధించింది. కంపెనీ పొగాకు ఉత్పత్తులను మరియు కంపెనీ కి సంబంధించిన కీలకమైన ఫైళ్ళను జప్తు చేసేందుకు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సౌదీ అరేబియా వాణిజ్య వ్యతిరేక కార్యకలాపాల చట్టం ప్రకారం ఎవరైతే వాణిజ్య మోసాలకు SR 1 మిలియన్ జరిమానా మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు









