అయ్యో.! పవిత్రా ఆంటీకి ఆఫర్స్ గోవిందో గో..విందా.?

- July 06, 2022 , by Maagulf
అయ్యో.! పవిత్రా ఆంటీకి ఆఫర్స్ గోవిందో గో..విందా.?

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితురాలైన పవిత్రా లోకేష్ ప్రస్తుతం సీనియర్ నటుడు నరేష్‌తో రిలేషన్‌షిప్ యవ్వారంలో తలమునకలవుతున్న సంగతి తెలిసిందే. ఇంట తేల్చుకోవాల్సిన ఈ విషయం రచ్చకెక్కేసింది.

బెంగుళూర్‌లోని ఓ హోటల్ రూమ్‌లో నరేష్, పవిత్రా లోకేష్‌లు రెడ్ హ్యాండెడ్‌గా నరేష్ భార్యకు చిక్కడంతో, ఈ ఇష్యూ మరింత వివాదాస్పదమైంది. ఈ వివాదాల కారణంగా పవిత్రా లోకేష్‌కి ఆఫర్లు చెల్లు చీటీ పాడేస్తున్నాయట.

టాలీవుడ్‌లో హుందా అయిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పవిత్రా లోకేష్ ఒకరు. అందానికి అందం, హుందాతనానికి హుందాతనం, తల్లిగా, వదినగా, అత్తగా.. ఇలాంటి పాత్రల్లో పవిత్రా లోకేష్ అప్పియరెన్స్ వుంటే, ఫ్రేమ్‌లో ఆ కలరింగే వేరు.

అలాంటిది నరేష్ యవ్వారం దృష్ట్యా తాజాగా రావల్సని ఆఫర్లు గోవిందా అంటున్నాయట. ఓ రెండు ప్రెస్టీజియస్ సినిమాల్లో పవిత్రా లోకేష్‌కి రావల్సిన ఛాన్స్, ఎందుకొచ్చిన గొడవలే అని మేకర్లు లైట్ తీసుకోవడంతో, వేరే వాళ్ల చేతికి చిక్కేశాయట.

ఇలా అయితే ఎలా.? ఈ ఇష్యూని వీలైనంత త్వరగా సెటిల్ చేసుకోకపోతే, పవిత్రా లోకేష్ కెరీర్‌కే గండి పడేట్లుందిగా.. అంటూ సినీ ప్రియులు వుచిత సలహాలిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాల కారణంగా కెరీర్ దెబ్బ తిన్న సెలబ్రిటీలు చాలా మందే వున్నారు మరి. పవిత్రా ఆంటీ.! తస్మాత్ జాగ్రత.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com