మరోసారి భక్తిరస ఛారిత్రక చిత్రంలో నాగార్జున..
- April 12, 2016
యంగ్ హీరోలు కూడా సక్సెస్ కోసం కష్టాలు పడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన నాగ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా కొత్త దనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ తన మార్క్ కంటిన్యూ చేస్తున్నాడు.
ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మరోసారి భక్తిరస ఛారిత్రక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తిరుమల వెంకటేశ్వరుడి పరమ భక్తుడైన హాథీరాం బాబాగా మరోసారి భక్తుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమా తరువాత సొగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బంగార్రాజు టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా సినిమా చేస్తున్న కళ్యాణ్, ఆ సినిమా పూర్తవ్వగానే నాగార్జునతో తెరకెక్కించబోయే సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









