బహ్రెయిన్‌లో ఆసియా డ్రగ్స్ స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
- July 08, 2022
బహ్రెయిన్: డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడిన 28 ఏళ్ల ఆసియా వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఐదేళ్ల జైలు శిక్ష, BD3,000 జరిమానా విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఏప్రిల్ 20, 2022న నిందితుడు తన స్వదేశం నుండి బహ్రెయిన్‌కు వస్తూ.. కాళ్ళ చుట్టూ రబ్బరుతో చుట్టుకొని నల్లటి గుడ్డలో నిషేధిత సైకోట్రోపిక్ పదార్థాన్ని బహ్రెయిన్ లోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఎయిర్ పోర్ట్ అధికారులు 3,500 గ్రాముల బరువున్న ఆ పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్ లో ప్రమేయం ఉన్నదని, బహ్రెయిన్‌లో పంపిణీ, మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే నిషేధిత మాదకద్రవ్యాన్ని తీసుకొచ్చాడని అధికారుల దర్యాప్తులో తేలింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..