హజ్ సేవల్లో నిర్లక్ష్యం.. ఉన్నతాధికారులపై వేటు
- July 08, 2022
రియాద్: హజ్ సేవల్లో నిర్లక్ష్యం చూపిన ఓ ఉన్నతాధికారులను తొలగించినట్లు సౌదీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది తీర్థయాత్ర కోసం సేవలను నిర్వహిస్తున్న హజ్ కంపెనీలలో ఒకదాని చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఒక ఉన్నత అధికారిని తొలగించినట్లు హజ్‌కు బాధ్యత వహించే సౌదీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాత్రికులకు తగిన సేవలను అందించడంలో విఫలమైనందున వారిని తొలగించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ఫీల్డ్ టీమ్‌ల పరిశీలనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. తొలగించిన ఇద్దరు అధికారులపై తదుపరి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యాత్రికులు హజ్ లో పాల్గొంటారని, యాత్రికుల భద్రత, సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యం చూపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..