భారత్ కరోనా అప్డేట్
- July 08, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. కొవిడ్ నుంచి 15,899 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.52 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.27 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది.
దేశంలో గురువారం 17,62,441 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,51,77,962కు చేరింది. మరో 3,79,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 9,25,494 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,725 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,85,51,294కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 63,68,901 మంది మరణించారు. ఒక్కరోజే 6,16,015 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,20,62,157కు చేరింది
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







