అంతర్జాతీయ స్థాయిలో బాలల కథ, కవితల పోటీ

- July 09, 2022 , by Maagulf
అంతర్జాతీయ స్థాయిలో బాలల కథ, కవితల పోటీ

ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా  అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు కథా, కవితల పోటీని నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 సంవత్సరాల లోపు తెలుగు పిల్లలందరూ ఈ పోటీకి అర్హులన్నారు.
కథలు,కవితలు దేశభక్తి, భారత స్వాతంత్ర్య ఉద్యమం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, భారత దేశ ఘన చరిత్రపై ఉండాలన్నారు.

స్వీయ రచనలు ఈ పోటీకి మాత్రమే రాసినవై ఉండాలని, వాట్సాప్, వెబ్సైట్,మరియు పత్రికల్లో మరెక్కడ ప్రచురించి ఉండకూడదనీ తెలిపారు.కవితలు 20 పంక్తులకు మించి ఉండకూడదని,
కథ చేతిరాత 3 పుటలకు మించి ఉండకూడదని, ప్రింటింగ్ లో A4 సైజులో మాత్రమే అంటే సింగిల్ పేజీ కథ .చేతిరాత బాగలేనివారు డి.టి.పి కానీ ఇతరులచే అందంగా రాసి పంపాలన్నారు.కథ,కవిత పిల్లల  సొంతమని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ హామీ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలన్నారు.

రచనలో  రాసిన వారి పేరు ఉండకూడదనీ,.హామీ పత్రంలో మాత్రమే ఉండాలన్నారు. విద్యార్థి పేరు,తరగతి ,ఊరు,జిల్లా , రాష్ట్రం,దేశం, సెల్ ఫోన్ నెంబర్ ఉండాలి .పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా గాని కథలు, కవితలు
ఆవుల చక్రపాణి యాదవ్
S.A తెలుగు
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ,గడియారం హాస్పిటల్ ప్రక్కన
కర్నూలు - 518001అనే చిరునామాకు పంపాలన్నారు. వివరాలకు 9963350973  సంప్రదించవచ్చన్నారు.విజేతలకు ప్రశంసా పత్రాలు,జ్ణాపిక,నగదుబహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు.పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని పోస్టు ద్వారా గాని మెయిలు ద్వారాగాని పంపబడతాయనీ తెలిపారు. కవితలు,కథలు తెలుగులో మాత్రమే ఆగష్ట్ 8 వతేదీ లోపుగా పంపాలన్నారు.బహుమతీ ప్రధానం ఆగస్టు 28న  నంద్యాలలో సాయంత్రం 4 గం. ఉంటుందని తెలిపారు.కవితలు,కథల పోటీలలో
 ప్రథమ బహుమతి 5,000/-,
ద్వితీయ బహుమతి 3,000/-
తృతీయ బహుమతి 2,000/-
మూడు ప్రోత్సాహ బహుమతులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున 3,000 /- అందచేయబడతాయనీ ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com