అరుదైన ఘనత సాధించిన అల్ హరమైన్ రైల్వే స్టేషన్

- July 10, 2022 , by Maagulf
అరుదైన ఘనత సాధించిన అల్ హరమైన్ రైల్వే స్టేషన్

జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) తో అనుసంధానించిన అల్ హరమైన్ రైల్వే స్టేషన్ అరుదైన ఘనత సాధంచింది.

అధికారిక సమాచారం ప్రకారం, సుమారు 99,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండటమే కాకుండా, ప్రపంచంలోనే ఎయిర్ పోర్ట్ కు  అనుసంధానించిన అతి పెద్ద రైల్వే స్టేషన్. 

మక్కా , మదీనా , కింగ్ అబ్దుల్లా ఆర్థిక నగరం మరియు జెడ్డా ప్రాంతాలను కలపడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మధ్య ఆసియా లోనే  ఎయర్ పోర్ట్ తో రైల్ అనుసంధానం చేసిన ఏకైక సంస్థ గా కైయా కు గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రాగానే విమానాశ్రయం నుండి ప్రతి పది నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ సౌకర్యం ద్వారా ప్రతి రోజూ భారీ రద్దీగా ఉండే మక్కా, మదీనా మరియు జెడ్డా జాతీయ రహదారుల మీద ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. 

ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులకు రవాణా భారం తగ్గుతుంది. అలాగే, దేశవ్యాప్తంగా 2030 నాటికి రవాణా మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్దితో ఉన్న సౌదీ అరేబియాకు ఇది ప్రతిష్టాత్మకమైనది   అని కూడ చెప్పవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com