శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్
- July 10, 2022
ప్రస్తుతం సంక్షోభ సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని భారత్ హామీ ఇచ్చింది. శ్రీలంకలో నెలకొన్న తాజా సంక్షోభం నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. క్లిష్ట సమయంలో శ్రీలంకను ఆదుకుంటామని ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం. శ్రీలంక ప్రజలు ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, ప్రజా స్వామికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తాం’’ అని బాగ్చి తన ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంక ప్రజలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఆయన రాజీనామా చేయనున్నారు.
ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. మరోవైపు ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నివాసాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అయితే, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, అందరి తరఫున కొత్త ప్రధానిని ఎన్నుకుంటానని విక్రమ సింఘే చెప్పారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







