కొవిడ్ నిబంధనల మధ్య ఈద్‌ను సెలబ్రేషన్స్

- July 11, 2022 , by Maagulf
కొవిడ్ నిబంధనల మధ్య ఈద్‌ను సెలబ్రేషన్స్

ఖతార్: ఖతార్ లో నిన్న ఈద్ అల్ అదాను కోవిడ్-19 నిబంధనల మధ్య ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా 588 మస్జీదులు, ప్రార్థన మైదానాల్లో ప్రార్థనలు జరిపారు. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పౌరులు, నివాసితులతో పాటు మొత్తం అరబ్ ప్రపంచానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈద్ సెలవుదినాన్ని ఆస్వాదించడానికి ప్రజలు ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా, వినోద ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు,  ఆతిథ్య సేవా కేంద్రాలు ప్రజల రాకతో కళకళలాడాయి. ఇటీవల కోవిడ్-19 కేసులు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.  దీంతో కొవిడ్ నిబంధనలను ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరిగి ప్రవేశపెట్టింది. ఈద్‌ను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, అర్హులందరూ బూస్టర్ షాట్‌లతో సహా టీకాలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ద్వారా కొవిడ్-19 ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి ఉండాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com