‘విక్రమ్’ చిరంజీవి చేయాల్సిన సినిమానా.?

- July 12, 2022 , by Maagulf
‘విక్రమ్’ చిరంజీవి చేయాల్సిన సినిమానా.?

లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ విమర్శకుల ప్రశంసలతో సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ధియేటర్లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రికార్డులు నమోదు చేసింది. రీసెంట్‌గా ఓటీటీలో విడుదలై అక్కడా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.

చాలా కాలం తర్వాత అసలు సిసలు సినిమా ఎక్స్‌పీరియన్స్ చేశాం.. అంటూ ‘విక్రమ్’ని ఓటీటీలో వీక్షించిన ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. 
నిజంగానే ‘విక్రమ్’ అలాంటి అనుభూతినే ఇస్తోంది. అయితే, ఈ సినిమాని, చిరంజీవికి ఆపాదించుకుంటున్నారు మెగా అభిమానులు. ఈ మధ్య ‘ఆచార్య’ సినిమా చిరంజీవి ఇమేజ్‌ని ఎంతలా డ్యామేజ్ చేసిందో తెలిసిన సంగతే. ఓ డైరెక్టర్‌ని గుడ్డిగా నమ్మితే దాని ఫలితం ఎలా వుంటుందో ‘ఆచార్య’ సినిమా ద్వారా అర్ధమైంది. 

‘ఆచార్య’ డిజాస్టర్‌ని ఎంత మాత్రమూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో వచ్చిన ‘విక్రమ్’ సినిమా.. మెగా అభిమానుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఈ సినిమా చిరంజీవి చేస్తే ఎంత బావుంటుందో.. అనుకుంటున్నారట.

మరికొంత మంది అయితే. అసలు ఈ కథ మొదట చిరంజీవి వద్దకే వచ్చిందట.. అంటూ కట్టుకథలు కూడా అల్లేస్తున్నారు. అవును.. చిరంజీవి విషయంలో అభిమానులు అలా అనుకోవడంలో తప్పు లేదు. ‘విక్రమ్’లాంటి సినిమాలో తమ అభిమాన హీరోని చూసుకోవాలనుకోవడం అస్సలు తప్పు లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com