సమంత డెడికేషన్ అలాంటిది: ఇంకీ సమంత ఏం చేసిందటా.!

- July 12, 2022 , by Maagulf
సమంత డెడికేషన్ అలాంటిది: ఇంకీ సమంత ఏం చేసిందటా.!

సమంత పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. సమంత డైవర్స్ ఎపిసోడ్‌కి సంబంధించి ఈ మహానుభావుడి పేరు బాగా పాపులర్ అయిపోయింది. సరే, ఆ సంగతి కాసేపు అలా వుంచితే, తాజాగా ఆయనగారు సమంతని పొగిడే పనిలో బిజీగా వున్నారు. 

ఎందుకో.? ఏంటో.? ఆ వివరాల్లోకి వెళితే, సమంతకు స్పెషల్ ఫోటో షూట్స్ చేయడంలో ఈ ప్రీతమ్ జుకాల్కర్ సిద్ధ హస్తుడు. అదేనండీ మేకప్ విషయంలో. ఈయన గారు డిజైన్ చేసిన అద్భుతమైన వస్త్రాలు ధరించి, ఫోటో షూట్లలో మెరిసిపోతుంటుంది సమంత.
లేటెస్టుగా ఓ ఫోటో షూట్‌కి సంబంధించి సమంత డెడికేషన్‌ని పొగడ్తలతో ముంచేస్తూ ప్రీతమ్ జుకాల్కర్ ఓ పెద్ద స్టోరీనే రాసుకొచ్చాడు. ఫోటో షూట్ల కోసం సమంత ఎలా ప్రిపేర్ అవుతుంది.? మానసికంగా ఎలా సిద్ధపడుతుంది.? అనే అంశాలను ప్రస్థావిస్తూ, తాజా ఫోటో షూట్‌ ఇష్యూని వివరించారాయన.

ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చీ రాగానే, సింపుల్‌గా మేకప్ వేయించుకుని, చాలా తక్కువ టైమ్‌లోనే సమంత రెడీ అయిపోయిందట. అస్సలు అలసటే తెలియనివ్వలేదట. అదీ సమంత డిడికేషన్ అంటే.. అంటూ ఫోటో షూట్ టైమ్‌లో తీసిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి, ప్రీతమ్ సాబ్ సెలవిచ్చారు. అదీ సంగతి.

అన్నట్లు సమంత, చైతూ విడాకులు తీసుకోవడానికి ఈ ప్రీతమ్ జుకాల్కరే అసలు సిసలు కారణం అనే ఆరోపణ వున్న సంగతి అందరికీ తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com