‘కోబ్రా’ ఈవెంట్ కి హాజరైన విక్రమ్: అందుకే ఆయన మిస్టర్ పర్‌ఫెక్ట్
- July 12, 2022
తమిళ స్టార్ హీరో విక్రమ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చిందనీ ఆసుపత్రిలో చేరారనీ, ఆయన ఆరోగ్యం విషమంగా వుందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిజమే. విక్రమ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం నిజమే. కానీ ఆయనకు హార్ట్ ఎటాక్ రాలేదు. ఛాతీలో నొప్పి కారణంగా చిన్న క్యాజువల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నాడంతే విక్రమ్.
ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం చేయొద్దంటూ ఆయన బాగానే వున్నారంటూ విక్రమ్ తనయుడు ధృవ్ ఈ విషయంలో ఒకింత అసహనం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే, విక్రమ్ పూర్తి ఆరోగ్యంతో వున్నారు. ఆయన తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ (కోబ్రా) ఈవెంట్‌లో విక్రమ్ కనిపించారు.
నిజానికి ఆయన అనారోగ్యం కారణంగానే మొన్న ఎప్పుడో జరగాల్సిన ఈ ఈవెంట్ వాయిదా పడింది. కాగా, ఈ ఈవెంట్‌లో విక్రమ్ చాలా ఫిట్ అండ్ పర్‌ఫెక్ట్‌గా కనిపించి, అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. తన అనారోగ్యం కారణంగా, అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేసిన హంగామాకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, తన ఆరోగ్యం పట్ల కొందరు చేసిన అసత్య ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. అలాంటి ప్రచారాల వల్ల కొందరు చాలా చాలా ఆందోళన చెందుతారనీ, దయచేసి, అలాంటి ప్రచారాలు ఎప్పుడూ చేయొద్దనీ, తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుందని విక్రమ్ స్పందించారు.
ఇక, పొన్నియన్ సెల్వన్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించారు. మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!