ఒమన్ బీచ్ లో కొట్టుకుపోయిన ముగ్గురు భారతీయులు..
- July 14, 2022
మస్కట్: ఒమన్ సముద్ర తీరంలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.బీచ్‌లో భారతీయుడు, తన ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు.రాకాసి అలలు తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేశాయి.ఆ ముగ్గురి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా తండ్రి, బాలుడి మృతదేహాలు లభ్యమయ్యాయి.కూతురి ఆచూకీ లభించలేదు.
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాకు చెందిన శశికాంత్ మెకానికల్ ఇంజినీర్‌గా దుబాయ్ లో స్థిరపడ్డారు. 20 ఏండ్ల నుంచి దుబాయ్‌లోనే శశికాంత్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.దుబాయ్‌కి చెందిన ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.అయితే బక్రీద్ రోజు సెలవు కావడంతో.. తన భార్య సారిక, ముగ్గురు పిల్లలతో కలిసి ఒమన్ సముద్ర తీరానికి వెళ్లారు.తీరంలో ఎంజాయ్ చేస్తుండగా రాకసి అలలు దూసుకొచ్చాయి.
దీంతో శశికాంత్.. ఇద్దరు పిల్లలు శృతి, శ్రేయాస్ అలల ధాటికి కొట్టుకుపోయారు. కళ్ల ముందే తన కుమార్తె, కుమారుడు కొట్టుకుపోవడాన్ని చూసిన తండ్రి.. అప్రమత్తమై వారిని కాపాడుకునేందుకు ముందుకెళ్లగా,ఆయన కూడా అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.ఒడ్డున ఉన్న భార్య, కూతురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు.ఈ విషయాన్ని శశికాంత్ సోదరుడు, న్యాయవాది రాజ్ కుమార్ ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..