ప్రముఖ దర్శక నటుడు కన్నుమూత..
- July 15, 2022
చెన్నై: సీనియర్ నటి రాధిక మాజీ భర్త, నటుడు ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా పడిఉన్నారు.ఆయన మరణ వార్త తమిళ ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీ లలో విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులు, నటీనటులతో పాటు సినీ లవర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియపరుస్తున్నారు.కాగా ప్రతాప్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రతాప్ ఆగస్టు 13, 1952 వ సంవత్సరంలో జన్మించారు. ఊటీలోని లారెన్స్ స్కూల్ లో చదువుకున్న ఆయన ఆ తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేశారు. మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 100 సినిమాల్లో నటించారు. అలాగే తన కెరియర్లో 12 సినిమాలుకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈయన1985లో రాధికను వివాహం చేసుకున్నారు. కానీ మరోసటీ ఏడాదే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత ప్రతాప్.. అమల సత్యనాద్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆమెతో కూడా 22 ఏళ్ళ వివాహ బంధం అనంతరం ప్రతాప్ విడాకులు తీసుకున్నారు. చివరిగా ఆయన బారోజ్ అనే మూవీ మలయాళం మూవీలో నటించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..