బిల్ గేట్స్ సంచలన నిర్ణయం...
- July 15, 2022
అమెరికా: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌తో పంచుకుంటున్న బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు తన సంపదలో కొంత శాతాన్ని ఇవ్వడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా నుండి పక్కకు తప్పుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు.‘మా బోర్డు యొక్క మద్దతు, మార్గదర్శకత్వంతో’ నా సొంత డబ్బులో 20 బిలియన్ల ను విరాళంగా ఇవ్వడం ద్వారా 2026లో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఖర్చును 6 బిలియన్ల నుండి 9 బిలియన్లకు పెంచుతానని చెప్పారు.ప్రస్తుతం బిల్ గేట్స్ ఆస్తుల విలువ 100 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ పేర్కొంది.
బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ 2000లో ప్రపంచంలో ఆకలి, పేదరికాన్ని తొలగించడానికి, వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్యా నిధులను అందించడానికి స్థాపించబడింది. ఫౌండేషన్ యొక్క అతిపెద్ద దాతలలో ఒకరు బిలియనీర్ పెట్టుబడిదారు వారెన్ బఫెట్. ఫౌండేషన్ యొక్క వెబ్సైట్ ప్రకారం.. 15 సంవత్సరాల పాటు ఫౌండేషన్‌తో ట్రస్టీగా పనిచేసిన బఫెట్, 2006 నుండి సంస్థకు 36 బిలియన్లకు పైగా బహుమతిగా ఇచ్చారు. ఇటీవల చవిచూస్తోన్న కరోనా వైరస్, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులతో పాటు ఇతర సంక్షోభాలను ప్రస్తావించిన బిల్ గ్రేట్.. ఇటువంటి కష్టకాలంలో మన భాగస్వామ్యం కూడా మరింత పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..బిల్‌గేట్స్ సంపద 113 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. 217 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలిస్థానంలో ఉన్నారు.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (134 బి.డాలర్లు), బెర్నార్డ్ జీన్ ఆర్నాల్ట్ (127 బి.డాలర్లు) రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇలా ప్రపంచ సంపన్నుల జాబితాలో కొనసాగుతున్న బిల్‌గేట్స్.. విరాళాలను మరింత పెంచడం ద్వారా త్వరలోనే ఆ జాబితా నుంచి బయటకు రానున్నట్లు పేర్కొన్నారు.
నేను భవిష్యత్తులో నా సంపద మొత్తాన్ని ఫౌండేషన్‌కు అందించాలని ప్లాన్ చేస్తున్నాను అంటూ బిల్ గేట్స్ ట్విట్టర్లో తెలిపారు. నేను నా సంపాదనను ఫౌండేషన్ కు అందించడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా నుండి వైదొలుగుతాను అంటూ బిల్ గేట్స్ పేర్కొన్నారు.మైక్రోసాఫ్ట్ పబ్లిక్‌గా వర్తకం చేయబడిన కంపెనీగా మారిన కొద్దికాలానికే గేట్స్ మొదటిసారిగా 1986లో ఫోర్బ్స్ 400 జాబితాలో కనిపించారు.1995 నుండి 2010 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అనే బిరుదును దక్కించుకున్నారు.మళ్లీ 2013 నుండి 2017 వరకు మరోసారి అత్యంత ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..