నడకతో క్యాన్సర్, డయాబెటిస్‌ను అధిగమించిన 82 ఏళ్ల ఎమిరాతీ

- July 18, 2022 , by Maagulf
నడకతో క్యాన్సర్, డయాబెటిస్‌ను అధిగమించిన 82 ఏళ్ల ఎమిరాతీ

యూఏఈ: రస్ అల్ ఖైమాలోని పర్వత ప్రాంతమైన వాడి అల్ ఖోర్‌లో నివసించే సేలం మొహమ్మద్ అల్ కాబీ(82) నడకతో క్యాన్సర్‌, మధుమేహాన్ని అధిగమించాడు. తాను తహజ్జుద్ ప్రార్థన తర్వాత రోజుకు 10 నుండి 12 కిలోమీటర్లు నడిచినట్లు అల్ కాబీ చెప్పారు. రోజూ మధ్యాహ్నం వేళల్లో పొలానికి వెళ్లి మగ్రిబ్ నమాజుకి ముందు ఇంటికి వచ్చేటప్పటికి గంటసేపు నడుస్తానని తెలిపాడు. తాను ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడ్డానని తెలిపారు. తనకు చాలా కాలంగా వాకింగ్ అలవాటు ఉన్నదని,  ప్రస్తుతం తన బరువు ప్రస్తుతం 49 కిలోగ్రాములుగా పేర్కొన్నాడు. రెగ్యులర్ భోజనం తీసుకుంటాను.. సమయానికి నీరు త్రాగుతూ ఉంటానని తెలిపారు. యువతీ యువకులు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా నడక, నీళ్లు తాగడం, నిత్యం భోజనం చేయడం వంటివి చేయమని అల్ కాబీ సలహా ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com