నలుగురు చిన్నారులను రక్షించిన సీడీఏఏ బృందాలు
- July 18, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని అల్-అతైబా బీచ్‌లో సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు చిన్నారులను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) బృందాలు రక్షించాయి. సీబ్ విలాయత్‌లోని అల్-అతైబా బీచ్‌లో నలుగురు పిల్లలు మునిగిపోయారనే సమాచారం అందడంతో మస్కట్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగం వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని సముద్రంలో మునిగిన పిల్లలను రక్షించినట్లు సీడీఏఏ వివరించింది. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పర్యవేక్షించాలని కోరింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈత కొట్టడానికి వారిని అనుమతించవద్దని సీడీఏఏ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







