‘పోకిరి’ రీ రిలీజ్: సూపర్ స్టార్ బర్త్‌డే గిఫ్ట్ ఇదేనా.!
- July 19, 2022
మహేష్ బాబు బర్త్ డే పార్టీని ప్రతీ ఏడాది ఫ్యాన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తుంటారు. అలాగే, మహేష్ కూడా తన కొత్త సినిమాలతో ఏదో ఒక కొత్త ట్రీట్ ఇస్తుంటాడు అభిమానులకి.
అయితే, ఈ సారి బర్త్ డే గిఫ్ట్ ఇంకాస్త కొత్తగా డిజైన్ చేశారట. అదేంటంటే, పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ‘పోకిరి’ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే సూపర్ డూపర్ హిట్ సినిమా. బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగ రాసిన సినిమా అది. ఈ సినిమాతోనే మహేష్ బాబు సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.
అయితే, ఇప్పుడీ సినిమా ముచ్చట ఎందుకంటారా.? ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారట. అందులో కొత్తేముంది.. అనుకుంటున్నారా.? వుంది వుంది.. ఈ సినిమాకి ఆధునిక సాంకేతికతను జోడించి రీ రిలీజ్ చేయనున్నారట. అంటే, 4K రిజొల్యూషన్లోకి రీ మాస్టర్ చేసి, డాల్బీ ఆడియోతో ఈ సినిమాని ధియేటర్లో రీ రిలీజ్ చేయబోతున్నారట.
ఈ మధ్యనే ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, దూకుడు మీదున్నాడు. ఈ దూకుడును ఇప్పుడు ‘పోకిరి’ రీ రిలీజ్‌తో కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారట.
ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ధియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయట. అదేదో కొత్త టెక్నాలజీ అన్నారు కదా.. దాని సంగతేంటో చూసొద్దాం అని.. జనం ధియేటర్లోకి వస్తారా.? లేక, కొత్త సినిమాలను చూసేందుకే ఇంట్రెస్ట్ చూపించని జనం, రీ రిలీజ్ సినిమాని అస్సలు పట్టించుకుంటారా.? లేదా.? చూడాలంటే, ఆగస్ట్ 9 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష