ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్..
- July 19, 2022
చైనా: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో చైనాలోని హాంగ్జౌలో జరగాల్సిన ఆసియా క్రీడలు-2022 కొవిడ్-19 ఉధృతి కారణంగా వాయిదా పడిన విషయం విధితమే. తాజాగా క్రీడలను నిర్వహించేందుకు OCA (Olympic Council of Asia) నిర్ణయించింది.గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చేసి తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది 23సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు మంగళవారం OCA ప్రతినిధులు ప్రకటించారు.
అథ్లెట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 19వ ఆసియా ఒలింపిక్ క్రీడలను 2022సంవత్సరంలో చైనా నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య క్రీడల నిర్వహణకు ప్లాన్ చేసింది. హాంగ్జౌలో మైదానాలను సిద్ధం చేసింది. అయితే ఊహించని రీతిలో చైనాలో కొవిడ్ వ్యాప్తి విజృంభించింది. ఇటీవల రెండు నెలల పాటు ఆ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి తీవ్రం కావడంతో అక్కడి ప్రభుత్వ లాక్ డౌన్ విధించింది. కఠిన ఆంక్షలను అమలు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సిన క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించింది. కొవిడ్ ఉధృతి తగ్గిన తరువాత క్రీడల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.
ప్రస్తుతం చైనాలో కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆసియా క్రీడలు-2022ను నిర్వహించేందుకు 6మే 2022న OCA ఎగ్జిక్యూటివ్ బోర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది గత రెండు నెలలుగా టాస్క్ ఫోర్స్ చైనా ఒలింపిక్ కమిటీ, హాంగ్జౌ ఆసియన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ , ఇతర ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లతో చర్చించి క్రీడల తేదీలను OCAకు తెలిపింది. మంగళావారం ఓసీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు వచ్చే ఏడాది సెప్టెంబర్23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆసియా క్రీడలు -2022ను నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే క్రీడలు జరిగే స్టేడియంలలో ఎలాంటి మార్పు చేయలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..